Thursday, July 26, 2018



నీకై

నిరీక్షి౦చే నా కళ్ళకు తెలుసు....

ఎన్ని రుతువులు ఓదారుస్తూ వెళ్ళిపోయాయో?

కరిగిన కాలానికి తెలుసు

నాలో ఘనీభవి౦చిన హిమపాతాలెన్నో...
....

ఈ ఉదయ స౦ధ్యలను అక్కున చేర్చుకొనే రాత్రికి తెలుసు

నాలోనే ఇమిడిన ఆ చీకటి పాట ఆలాపనలు

ఆర్ద్రమైన నా హృదయ ఘోషకు

మూతపడని నా కనురెప్పల ఓదార్పులు

.........

నీ ధ్యాసల్లో ఇగిరిపోతున్న క్షణాల్లో

నా కొన ఊపిరిని తీసుకెళ్ళే "ఆ చివరి క్షణ౦" చిక్కుకొనే ఉ౦ది

చప్పుడు చేయకు౦డా

రాలిపడే ఆకుల కన్నీటివెతలు ఏ తడి గు౦డెకో ఎరుక......!!!

Cv Suresh
చెన్నూరు వంకదార సురేష్..
CV. సురేష్ గా వినుతికెక్కిన
మా సిరిపురపు నివాసి..
కవిసంగమంలో తన కవితల ద్వారా, అనువాదపు శీర్షికలోనూ ఎంతోమందికి చిరపరిచితులు..ఇంకా నాలాంటి కొత్తవారినెందరినో తన వ్యాఖ్యలను, సూచనలను పంచి ప్రోత్సహిస్తున్నారు..
సాధారణ వ్యాపారిగా జీవితాన్ని మొదలుపెట్టి విద్యార్థి సంఘ నాయకుడిగా,జర్నలిస్టుగా
క్రైం న్యూస్ లతో పాటూ పలు సాహితీ అంశాలను నివేదించారు .సీమలో లబ్ధ ప్రతిస్టులనదగ్గ దిగ్గజాలతో నెయ్యంకలిగినవారు..
క్రిమినల్ లాయర్ గా, విజయవంతమైన వ్యాపారవేత్త గా, పురప్రముఖులుగా
పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలలోనూ,రాజకీయ రంగంలోనూ చురుకైన పాత్ర పోషిస్తూనే కవితా సేద్యం ఇష్టమైన ప్రవృత్తిగా సాగిస్తున్నారు..
వీరి శ్రీమతి జయా సురేష్ న్యాయవాదిగానూ సామాజిక రాజకీయ రంగంలోనూ కృషి చేస్తున్నారు..కుమార్తె లీన జర్మన్ విశ్వ విద్యాలయంలో నానో టెక్నాలజీ రోబోటిక్స్ రంగంలో phd చేస్తున్నారు..అబ్బాయి రేవంత్ హైకోర్టులో న్యాయవాది గా ప్రాక్టీసు చేస్తున్నారు.. నిత్యం బహు కార్యక్రమాలలో తలమునకలుగా వున్నా
సాహిత్యాభిలాశ ,పఠనాశక్తి నన్ను అబ్బురపరిచింది..AIR లో గ్రేడ్ 1 ఆర్టిస్టుగా జానపద సంగీతాన్ని ,వేణు గానాన్ని ఇష్టంగా కొనసాగించేవారు..అన్నమయ్య పద సంకీర్తనలు పై ఓ పక్ష పత్రికలో కాలమ్ నిర్వహించారు. ముఖ్యంగా అనువాద ప్రక్రియ వీరికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొనివచ్చింది.
మృదుస్వభావి,స్నేహశీలి . మంచి enterprenuer.
వారు రాసిన గులాబీల సిరీస్ లోని భావ కవితలు ఎందరినో అలరించాయి..
అలాంటి వాటిని ఒక తులిపి ప్రయత్నంగా అనువాదించాలని అనుకున్నా..నిజానికి ఇది నా స్థాయి కి చాలా సాహసమైన పనే...కానీ ఒక wild attempt.. let my trial may be blessed with suitable suggestions.
ఎందరినో వారి శీర్షికలు ద్వారా పరిచయం చేసిన సురేష్ గారిని వారి జన్మదిన సందర్బంగా ఇలా మీ ముందుకు తీసుకొని రావడం ఈ చిరు ప్రయత్నం..
//The roses-1//
You
glorifies the blossoms n' ragaas..
Me
remains enjoying the fragrance n' melodies of them...
Being the six nodes of musical chords in you
I remain your orderly...
//The roses -4//
Hey...Listen..
Here.. exactly here
How that jaded heart melted into words
Slipped on your lips...
n' emerged as lovely sonnet...
If
you move away from my soul,
get disappeared.
Can you say why these barren moments of mine reveals desolation in me..
Perhaps
This is the earliest experience for me expecting those whity roses resembles as
the inner glory of our soul..
Neither you come
The lonely footsteps
of yours sounding silence
Enlighten n' reflecting in me is sounding myself in you....
I consider this is
the admirable enlightenment of mine with you...

You just leave certain uncertain responses for your doubtful questions sounding whole night..
Ofcourse, it us not new from you n' me
Now..
At this moment..
I wish to pen this restless gleen of love into new sagaa..
//The roses-6//
Here.....
To this night
The resilience of those white roses had its breath of those wide opened souls..
The sustained flow of entire night get drained unknowingly
in trembling sights,
disguised talks of the couple..
Those restaurant chandeliers manifest of their solitude
Sing Justin Buyer's tune harmoniously..
One day..
May this night exactly..
For which they were awaiting..
This moment..
This particular moment...
The loving heart move towards the poetry of Keyts..
Those mollifying longer hours between them counted love sonnets of Neruda...
That exceptional moonlight how they carried those twinkling springs on those holy candles..
How they serve the wings of silence that crept in their loving solitude..
Awaiting if seasons get ignored..
What remained is just nescience..
That night ..
Exactly that night
That serine moonlight blessed them to remain in platonic love..
//गुलाब-2//
नजाने कितने बाते हमाते बीच बेहगये
कुछ खिला जैसे भोगणविल्ला फूल की तरह
कुछ प्रसून जैसे गुलमोहर जो बहते सावन से हाथ मिलाते।
कितने बार कहा आपने
इस सुनहरे पल को ऐसेही मुट्टीमें बांध कियाजाये थो अच्छा होगा ।
कई खामोशी के पल
हमारे बीच भाषा के अतीत बातचीत करता था
कुछ नीरवता गिरा जैसे गेहरीला बारिश
और कुछ यैसे जैसे मसनमोहक चांदनी
कुछ प्रज्वलित हुआ जैसर नीरव आसमान
कईबार तुमने कहा कि
देखो चुपचुपाई में भी
कैसे हुम् बाते बनाते हैं ।
नजाने कैसे हमारे अनमोल अकेलापन की घड़ियां हमारे बीच बेहगये
कुक्ज अजीब पहेलियाँ फेलथी आई ,,,,
यहाँ। ,, ठीक यहाँ
कुछ अनोखे खुशबुवोंको
इस दिल में छोड़कर
कुछ सुनहरा मुसखुराहठेको
हमपर पेलते
अव्यक्त अनुभूतियोंको एगासस दिलाया ।।
नजाने कितने बार पूछता मैन
क्या तुम्हें वो कौनसी अनोखी ताकत हैं
जिससे तुम हमारी हर एक एकांत को मुझमें याद्दास्त में प्रकटित करसको ।।
हा एभी सहीहै
आपका इज़हार साथ साथ जनमोक रिस्ता
और हमारा यक़ीनथा
सौ सौ जन्मोका प्यारका विस्वास
हा एभी सच है
हमारा प्यार एक सुनेहरीला इतिहास ।।
//गुलाब-3//
वो कहते हैं
हमे आप पसंद हैं
वुन्होने पूछा
कौए वजा है क्या नदी जैसा ,,?
एक झील जैसी खामोशी बेहगायी वुण्डोने के बीच में
कुछ देर बाद वुन्होने कहा
क्या तुम बतासकतेहो क्यों
इनफूल, कोयल ,दिल येसब
सुनहरे बसन्त को चाहते हैं ?
वे रहगायी खमूशीमें
फ़िर उन्होंने कहा
देखो जानेमन आपकी खामूशी
मुझमे नजाने कितनी बाते समाजमे लाया ।।
अब वो बोली
लो एक शायरी सुनादो...
सावन मैं पीहू बनकर आपकी शायरीका सुर बनजावू...
वो निःसब्द सुर में अपनी एक कविता सुनाया
वुन्होने अपने दिलकी धड़कनमे वो कविताको मिलदी
अब वुंदोनोके बीचमें अद्भुत सिधाई ही बातचीत कर रहीहैं
थोड़ीदेर बाद वुन्होने कहाँ
आपकी ये मौन परिभाषा
हमभी बेहद पसंद हैं ।
उनकी आँखोम्मे अब हजारों रंग के फूल खिलगये
इसका मेहक उनका पालकोमे भरा और मन बेहलाया
एक दूसरोंकी चाहत देखकर अब ये सिधाई ,ये सावन
खुशी से मुसकुराते हैं ।।
మూలం...CV సురేష్.
అనుసృజన..
మౌనిమ.రామాయణం.
నిద్ర నివ్వని రాత్రిలో...
..
ఆ నిద్ర నివ్వని రాత్రి లో
రెప్పలు మూయని
స్వప్నజ్ఞాపికలు


..
స్వప్న హృదయాలపై
భోరున కురిసే
దిగులు వర్షపు నిశ్శబ్ద దడి
..
ఆ గది నిండా
ఈ మది లోపల
అల్లుకొన్న అక్యూమలేటెడ్
జాగరణక్షణాలు...!
..
ఏ మలి జామో
భారంగా మనపై
జరిపే నిద్రల దురాక్రమణ...!!

..
సరిగ్గా ఇక్కడే

Monday, July 16, 2018



                               సి.వి.సురేష్ || నా స్వప్నం ||

                                                      

..
నా స్వప్నం
నా ముందే సుళ్ళు సుళ్ళుగా తిరిగి ఎగిరి పోతాది ..
నల్లమల అడవి అంచుల మీదనో...
నాగేటి సాలల్లోనో ఇగిరి పోతాది. 
..
నా స్వప్నం ..
ఓ నిషిద్ధ కావ్యమవుతాది.
నా కల..
మేనిఫెస్టోల్లో అందంగా రాయబడతాది...
ఒక వీరుడి 
మరణవాంగ్మూలపు లేఖ లో అక్షరమవుతాది 
నా స్వప్నం 
ఓ వేకువజామున 
అడవిలో తూటాలకు బలి అవుతాది..
ఓ పూరి గుడిసె లో 
ఆకలి చావు అవుతుంది
సర్కారు హత్య అవుతుంది 
పెను శోకమవుతుంది!
...
విరిగిన ఆకలి ముక్కలను పేర్చుకుంటుంది.
నల్లరేగడి నేలలో నోట నురగవుతుంది.
వరిమడిలో బోరున విలపిస్తుంది.
నా స్వప్నం
చితికి చిద్రమైన పల్లెల్లో
కృష్ణమ్మ కన్నీళ్ళల్లో .
ఎర్రరేగడి నేలల్లో .... శోక తప్త .
..
నా కల...
చితికిన బ్రతుకుల్లో...
నిదుర లేని రాత్రుల్లో
అలుపెరగని నా కళ్ళల్లో...
మళ్ళీ రేపటి రాత్రికై ఎదురు చూస్తాది.....!.






                          



         

                                                                                   

Monday, July 9, 2018

కొ న్ని జ్ఞాపకాల చివర

                        




|| కొ న్ని జ్ఞాపకాల చివర ||

సి.వి.సురేష్

ఎప్పటిలాగే...
విరిగిన ఒక జ్ఞాపక౦ మళ్ళీ అతికి౦చుకొ౦టు౦ది
అది శరీరాన్ని కానీ, 


మనసును కానీ చేరే ప్రయత్న౦ అప్రయత్న౦గానే

సరె!
ఏ ఒక్క జ్ఞాపకమైనా స౦తోషాన్నిచ్చి౦దా?
సముద్రమ౦త వ్యధను నీపై తోయడ౦ మినహా

వెలుగు రేఖలు నిరాశగా కన్నీళ్ళు కార్చడ౦
ఉపశమనాల ఊరటగా భావిస్తున్నావ్

2

ఎన్నోసార్లు నీలోకి నీవే
కా౦తికిరణాలేవి చొరబడన౦త చీకటిని ప౦పేశావు!
అనుభవమొప్పుడూ
తీర౦ వైపుకు లాగే విఫలయత్న౦ మునుపటి లాగే

వ్యధను కప్పేసే పెదాలు
ఎప్పుడూ ఒక చిరునవ్వును నిల్వ ఉ౦చడ౦
తప్పి పోవాలి ..
తప్పిపోవాలి ....

ఆలస్య౦గా నైనా సరే
ఎలాగైనా నీవు తప్పుకోవాలి!!!

@ సి.వి.సురేష్ 
నా కవిత కలెక్షన్ ల నుండి

గీ తి క



 || గీ తి క ||
సి.వి.సురేష్
అవని పైనున్న ఏ అందాలైనా ...
అవి ఆమె ఇష్టపడితేనే 
వాటికి ఆ సౌరభమూ,
ఆ గొప్పతనమూ వస్తాయని భావిస్తాను!
...
నా సజీవ‌ ప్రేమ లో
నన్నో షాజహాన్ గానో,
శరత్ దేవదాసు గానో ఊహి౦చుకొ౦టాను
...
ఆమె పై అద్భుతమైన నా ప్రేమను
ఓ ఇలియాట్ లాగనో
డికెన్‍సన్ లాగనో
అస్కార్ వైల్డ్ లాగనొ
ఈ యువ జగత్తుకు కవితా రూపంలో రాసి

 వినిపించాలని ఉంటుంది.
....
ఇంకా నా ప్రేమ ను
విశ్వప్రేమికులంతా ఆదర్శంగా 

తీసుకోవాలనిపిస్తుంది
....
సరే, ఈ మాటలు ఎక్కడైనా నేను ప్రస్తావిస్తే
నా మానసిక స్థితి ని అనుమానిస్తారేమో అన్న

 భయం కూడా లేకపోలేదు..

నా ఈ సందేహం నా ప్రేయసినె అడిగి తెలుసుకోవాలని

నిర్ణయాని కొచ్చా!

ఏది ఏమైనా సరే నా ప్రేమ ఎజెండా పుష్పగుచ్చాలతో మలచాలని..!


నన్ను నేను సమర్థి౦చుకొ౦టాను....
అది నాకూ సబబే అని రూడీగా నిర్ణయించేసా!
....
నా ఈ మార్పులన్నిటి వెనుక కారణం కోసం
నా పదహారేళ్ళ ప్రాయం నుండి ఇప్పటి దాకా శోధిస్తూనే ఉన్నా.!

॥......... ॥





॥......... ॥

సి.వి. సురేష్

నాలో నిరీక్షణ క్షణాలను
కనురెప్పల అ౦చులను౦డి జారకము౦దే
అ౦దుకొ౦టావు క్షితిజరేఖలా....

హృద్య౦తరాలల్లో మార్మోగే స౦గీతాన్ని
నా మనసు పాడకము౦దే
మధుర గాయనిలా ఆలాపన౦దుకొని ఆహ్లాది౦పచేస్తావ్!

ముని వ్రేళ్ళతో సవరిస్తూ..
హృదయాన్ని కదిలి౦పచేసే
ఓ రసరమ్య భావన్ని నాలోకి జారవిడుస్తావు

....
ఎన్నో ఏకా౦తల మద్య
అన౦తమైన నా ప్రేమను నిరూపి౦చే సమయాలు
నీ ము౦గిట వేచిఉన్నాయి..

కొన్ని పూర్తికాని పల్లవిలు....ఇ౦కొన్ని భావావేశాలు...
బహిర్గతమవుతున్నాయ్..
నీ మౌన పరిభాషల‌ తాకిడిలో.....!

...
అద్భుతాల సమాగమైన నీకో
కవిత అ౦కితమివ్వాలన్నది నా కోరిక !!

('తొలిఅడుగులు"...నా కవితల కలెక్షన్ ను౦డి)

హృదయ భాష్పం




 // హృదయ భాష్పం //
సి.వి.సురేష్

నీకై
నిరీక్షి౦చే నా కళ్ళకు తెలుసు....
ఎన్ని రుతువులు ఓదారుస్తూ తన ముందే వెళ్ళిపోయాయో?
కరిగిన కాలానికి తెలుసు
నాలో ఘనీభవి౦చని హిమపాతాలెన్నో...
....
ఈ ఉదయ స౦ధ్యలను అక్కున చేర్చుకొనే రాత్రికి తెలుసు
నాలోనే ఇమిడిన ఆ చీకటి పాట ఆలాపనలు!
..
ఆర్ద్రమైన నా హృదయ ఘోషకు
మూతపడని నా కనురెప్పల ఓదార్పులు
నీ ధ్యాసల్లో ఇగిరిపోతున్న క్షణాల్లో
నా కొన ఊపిరిని తీసుకెళ్ళే "ఆ చివరి క్షణ౦" చిక్కుకొనే ఉ౦ది
చప్పుడు చేయకు౦డా
రాలిపడే ఆకుల కన్నీటివెతలు ఏ తడి గు౦డెకో ఎరుక......!!!
...
(కవిత్వపు తొలిరోజుల్లో...మురిసిపోయేవాడిని..ఈ వచనపు వాక్యాలు చూసి)

ఒక రాతిరి..



// ఒక రాతిరి...//
సి.వి.సురేష్
ఎక్కడికని ఈ రాతిరి నిను తీసుకెళ్తుంది..?
కొన్ని కలల పచ్చితనాన్ని 
ఇంకొన్ని ఆరాటాలనీ..
గదుల్ను౦డి గదుల్లోకి మారుస్తూ...
స్వర్గ స్రావం లోకి మోసుకెళ్తుందా..?
.
జ్వలిస్తున్న నేత్రాలలో కటిక చీకట్లు..
కాంక్షిస్తున్న ముద్ర ల్లో ఖాళీ గదులు
మూయని రెప్పల గుండా.
దొర్లని క్షణాలు...
రెప్ప మూసినా కదలని ఆలోచనల కదంబాలతో ...!
ఎక్కడికని ఈ రాతిరి నిను చేరుస్తు౦ది.?
.
ఆలోచనల పొరలను గుచ్చి బాదించే
నక్షత్ర కాంతుల ముల్లులు ...
వెన్నెల మంటలో ఎర్రగా కాలే
ఆ దేహపు కమురు వాసనలు....
ఎంత సేపని ఈ రాతిరి నిను బాదిస్తుంది?
.
నీడల్లా పరచుకొన్న శబ్ద ప్రవాహం...
నిశ్శబ్ద నిశీధి నుండి కొమ్మల మీదుగా
ఒక్కో చీకటి బొట్టూ....
దాటు కొచ్చిన రాతిరి
నిన్నేతీరం వైపుకు సాగనంపుతుంది!?
.
2
లోలోపలనే
పారి, ఘనీభవించిన సముద్రాలు
చుట్టూ..
చేతులు జాపిన మరణ మాయ
వెయ్యిన్నూట రెక్కలతో స్వప్న తీరాలను చేర్చే..
ఈ కటిక రాతిరి...
నిన్నిలా ఆవహించక పోతుందా?
.
3.
కరిగే కాలం నుండి కారే చీకటి..
నిన్నో స్థితి నుండి అస్తితి కి జారవిడిచి
రహస్య బాష లను గొంతు స్నాతం లోకి ది౦పుతూ..
పాడే రాతిరిపాట నిన్నే లోకం లోకి చేరుస్తో౦ది?
.
4
ఊపిరి ఆగాక సాగిల పడే
కరుణ,...
కడదాకా..... కదిలి ...
నిన్నో చిక్కటి రాతిరి లో కప్పెట్టేయదా?

మ ర ణే చ్చ






|| మ ర ణే చ్చ ||
సి.వి.సురేష్ 

ఇక్కడ అంతా 
అనుకొన్నది అనుకోన్నట్లే జరిగిపోతుంది 
.....
పీల్చే గాలులు 
రెండుగానో మూడు గానో..
నిలువునా చీలిపోతాయ్
చీకటిలో తెగిపడిన మనసులు
చస్తూకూడా మరణసుఖాన్ని పొందలేన౦తగా.....!
....
అమాంతంగా వ్యాప్తమయ్యే
బిందువు లేని వృత్తమొకటి
మతాల మూలుగులను
కలిపి కుట్టేయలన్న ఆలోచన తో సాగుతుంది..
సిరదమనుల్లో పవిత్ర జలాలు
శుద్ది చేయబడుతుంటాయి
.....
సూది దూరనంత బెజ్జం లో
అసత్య అర్ధరహిత కుటిలత్వమేదో మతం ముసుగులో
ఆసిడ్ వికృత మరకల్ని వదిలి వెల్తు౦ది
....
దీనంగా గుమ్మం లో పడిన నేటి పత్రికలు
అసహనపు రాతలన్ని మోసుకొచ్చి చెదిరిన ముగ్గులా
జీవన భయ విహ్వలత ను
ఇంటి గుమ్మాలకు తగిలిస్తు౦టాయి..
.....
అరణ్యాన్ని కార్చిచ్చుకు అప్పచేప్తారు
ఎముక మూలుగల్లో
ఏమేమో రగుల్చుకొంటాము
ఉన్న ఒకే ఒక్క పావుర౦
యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలనుకొంటుంది
....
హృదయోర్ముఖాలు పగలగొట్టి
మరణేచ్చను
ఇప్పుడు హెరిడిటి గా అందిస్తారు..
...
అంతా..
సవ్యంగానే సాగుతుంది..అనుకొన్నది అనుకొన్నట్లే!!!

విరామ దుఖం



 || విరామ దుఖం || 

సి.వి.సురేష్

బ్రతుకు దుఃఖమేదైనా మిగిలి ఉంటే 
నూలు స్వెట్టర్ లో వెచ్చగా చుట్టేసి
తీరపు అంచున కూర్చొని
ఒక్కో దుఖాన్ని జారవిడిచే నగ్న నేత్రం.....!
..
..
షరా నవ్వుల మర్మాన్నో....
కన్నీటి ద్వైభాషల అర్థాలనో ఆరాలు తీసీ..తీసి
అలసిన ఆకుపచ్చ మైదానం...
జీవిత నాటకపు చివరి అంకాన్ని 

ట్రాజెడీ గా మార్చాలో? కామెడి గా మలచాలో ?
అర్థం కాక అర్ధా౦త౦గా వదిలేసిన ముగింపు
..
..
దంకన్ స్టీల్,
నోస్టర్ డమాస్, అమియోబ్ ల యుగా౦తపు రహస్యద్వారాల
అన్వేషణలొక వైపుగా..
వేల కోట్ల పడగల సాగరాన దాహార్తియై
చివరకు ఎం మిగిలిందన్న నిర్వేదం మరొక వైపూ...
అనుభవిస్తూ ఆ నిస్తేజమైన కళ్ళతోనే
మహా స్మశానాన గడిపుతున్న సుదీర్ఘ రాత్రులు!!
..
..
2
బ్రతుకు కీళ్ళ సందుల్లోన
గతం ఆడిన కీలుబొమ్మల ఆటల జ్నాపకాల పెను బాధ!
విశ్రాంత దేహాన్ని
అక్కున చేర్చుకొనే తీరం...
తన ఒడ్డున సేద తీరే ప్రతి చివరి క్షణాన్ని పంచుకొంటుంది.....!!!



ఏం మిగిలిందంటావ్ ?



 || ఏం మిగిలిందంటావ్ ? ||
సి.వి.సురేష్

అట్లా అని వెనుక
పెద్దగ మిగిల్చి౦దీ ఏమీ లేదు 
మహా అయితే 
ఒకరి నొకర౦ తరుముకొంటూ 
ఒకరిలో ఇ౦కొకరం వాన గా చేరి తడుపుకొవడ౦ మినహా..!
..

ఇంకా చెప్పాలంటే 
కొన్ని సార్లు కొడిగట్టిన చమురు దీపాల్లా 
ఇంకొన్ని సార్లు దీపపు పురుగుల్లా.....
ఏడుస్తూ వచ్చి 
ఇచ్చే సంతోషాన్నీ క్షణికం చేసి 
ఏడిపిస్తూ వెళ్ళిపోయే బంధాలనూ క్షనికాలే చేయడం తప్ప !
వెనుక
పెద్దగ మిగిల్చి౦దీ ఏమీ లేదు !

......

అట్లా అని
మిగిల్చిన జ్ఞాపకలూ ఎమీ లేవు 
మహా అయితే
అల తీరాన ఒదిలి పెట్టిన నురగ లాగా
గిరిటాలు కొడుతూ ఎగిరే గాలిపట౦లొ 
కేరింతలు కొట్టిన అమాయకత్వపు బాల్యమూ ....!
..

ఒడి దుడుకుల జీవిత౦ లో 
ఒంటికి రాసుకొన్న నైట్ క్వీన్ స్సెంట్ పరిమలాలతో
పడగ్గదిలో చేసిన సంతాన ప్రక్రియా ....
..

వేల మైళ్ళు నడిచిన నిజం 
బయలుదేరిన చోటే ఉండిపోయానన్న దిగులూ ... 

నీవో...నిరాశావాదివని గొంతు పెగిలేలా 
చుట్టు చేరి చెప్పే గొంతులూ ..
కాకుంటే
వంగి వంగి చేసిన సలాములు 
మోకరిల్లన క్షణాలు మినహా.
అంతకు మించి 
పెద్దగ మిగిల్చిన జ్ఞాపకలూ లేవు 

........

జీవిత౦ 
వాన నీటి లో 
విడిచిన కాగితపు పడవని 
తెలిసేలోగా 
టేబుల్ సొరుగు లో 
నిశ్చలమైన మొనాలిస మృత నవ్వుతో 
నిలిచి పోయిన పాత గడియార౦ !!

ప ద ౦




|| ప ద ౦ ||
సి.వి.సురేష్
ఒకానొక నిర్వేదపు అ౦చుల్లోనో
నమ్ముకొన్న నమ్మక౦ కసిగా కాటేసిన తరుణానో
ఎదురి౦చలేని నిస్సత్తువ నిలువునా ము౦చినప్పుడో
నా పదాల నిండా మ౦దుగు౦డు ని౦పాలనుంటు౦ది..
..
అగ్నిపర్వతాల నడుమ ఉదయంచే
మరో సూర్యుడి సెగనూ
కుత కుత ఉడుకుతున్న లావాను
పదాల నిండా వొ0పాలనుంటుంది
..

రగిలిన‌ భావాల్ని నేనే పలకరిస్తూ
నాపై అవి నడుచుకుంటూ వెళ్ళే వరకూ
అలా ఆశగా పదాలను రాస్తూనే ఉ౦డాలను౦ది!
ప్రశ్నిస్తూనే ఉండిపోదామను0టుంది...!
..

నియంతల గుండెలపై ..
నా పదాలు గురిపెట్టినప్పుడో
పదాలు రాసే చేయి కాలుస్తూనే రాస్తుంటుంది..!
..
ఒక్కో పద౦
ఒక్కో దేహాన్ని విచ్చుకుంటూ
ఇంకో దేహంలోకి చొచ్చుకుంటూ
విఘడియల కాలచక్రాన్నివెనక్కు తిప్పాలను౦టు౦ది!
..

కొన్ని క్షణాలు నన్ను ఆశక్తుణ్ణి చేసినప్పుడు..
నా చేతి వ్రేళ్ళను వెనక్కు విరిచినా..
అసహనంతో నన్ను దిగంబరుణ్ణి చేసినా
నా పదం నన్నొ జీవనది లా ప్రవహింపచేస్తుంది..!
..
ఒకసారి
ఒక్కో అలోచనా నరుక్కుంటు౦ది..
మళ్ళీ పదాలతో అదే అతికించుకొంటో౦ది
గు౦డెలోతుల్లో ఉద్భవి౦చే పదాలు
చాలా సార్లు ప్రసవవేదనలు పడుతూ
నాలో ఖాళీలను పూరిస్తూ పూరిస్తూ
రాస్తూ చెరిపేస్తూ
ద్వంసించుకుంటూ నిర్మించుకుంటూ ఉ౦టు౦టాయి
..

నాకు బాగా గుర్తే ఒక్కో పద౦
నా పాదముద్రల్నే కబళించుకుంటూ
నన్నొక అపరిచుతున్ని చేసి
నా పదాలే సందిస్తున్న‌ ప్రశ్నల్లా నిఠారుగానిలుచు౦టాయ్!
..

అయునా...సరే!
ఓ సజీవ చిత్రాన్నో
ఓ స౦క్లిష్టతనో
ఓ భీభత్సాన్నో
ఓ అనుభూతినో
నాలోని అంతః బహిర్ అనుభూతుల్నో
ఒక హృదయ స్పందననో
నా కలం పురుడుపోస్తూనే ఉంటుంది
..

పురుడుపోసుకొన్న ప్రతీసారీ
బ్రహ్మాండమైన శూన్యం నా మనసు నిండా! ! ! 

నా స్వప్నం





 || నా స్వప్నం || 

సి.వి.సురేష్
..
నా స్వప్నం 
నా ముందే సుళ్ళు సుళ్ళుగా తిరిగి ఎగిరి పోతాది ..
నల్లమల అడవి అంచుల మీదనో...
నాగేటి సాలల్లోనో ఇగిరి పోతాది. 
..
నా స్వప్నం ..
ఓ నిషిద్ధ కావ్యమవుతాది.
నా కల..
మేనిఫెస్టోల్లో అందంగా రాయబడతాది...
ఒక వీరుడి 
మరణవాంగ్మూలపు లేఖ లో అక్షరమవుతాది 
నా స్వప్నం 
ఓ వేకువజామున 
అడవిలో తూటాలకు బలి అవుతాది..
ఓ పూరి గుడిసె లో 
ఆకలి చావు అవుతుంది
సర్కారు హత్య అవుతుంది 
పెను శోకమవుతుంది!
...

విరిగిన ఆకలి ముక్కలను పేర్చుకుంటుంది.
నల్లరేగడి నేలలో నోట నురగవుతుంది.
వరిమడిలో బోరున విలపిస్తుంది.
నా స్వప్నం 
చితికి చిద్రమైన పల్లెల్లో 
కృష్ణమ్మ కన్నీళ్ళల్లో .
ఎర్రరేగడి నేలల్లో .... శోక తప్త .
..
నా కల...
చితికిన బ్రతుకుల్లో...
నిదుర లేని రాత్రుల్లో 
అలుపెరగని నా కళ్ళల్లో...
మళ్ళీ రేపటి రాత్రికై ఎదురు చూస్తాది.....!.

బైరాగి గీతం



 || బైరాగి గీతం ||
సి.వి. సురేష్
.
మృత్యువు కు జన్మకూ మధ్య
నలగని కాల౦ లో
ప్రత్యక్షపరోక్ష దుఃఖాలను తవ్వేస్తూ
రెండే రెండు జ్ఞాపకాల అలజడి....!
....
పారే నదిపై
ఇంకిన ప్రవాహాలను ము౦చెత్తే..
వ్యధల వెతల్లోని
భిన్నమైన నిశ్సబ్ద నివాళులు!
కరిగిపోయే రాతిరి అంచున
సజీవంగా వ్రేలాడే కొన్ని దుఖాలు
.....
చెప్పా పెట్టక వెళ్ళిపోయే
చిట్టచివరి శ్వాసల చుట్టూ
వ్రేలాడే మమతల జిగురు పాకాలు
ఎప్పటికీ.....!


అంతః ప్రయాణం


..




 || అంతః ప్రయాణం ||
..సి.వి.సురేష్
ఒక సందర్భంలో నేనో రాయిని భూమిలో పాతాను
దానిపైన నే సాధించిన‌ ఘనత రాశాను
నా కీర్తి గురించి ఆ రాయిమీద మొత్తం రాసేసాను.
అంతటితో ఆగలేదు...
ఇంకా ఇలా రాశాను
వయసుడిగే కొద్దీ కీర్తి కాంక్ష నన్ను మింగేసిందని.
పాతిన రాయికి ఆనవాలుగా నా 'దిగులు'ను అక్కడ‌ వేలాడదీశాను
2
ఇంకో సందర్బంలో ఓ చెట్టును నాటాను
చాలా కాలం బ్రతికేలా దృడంగా నాటాను
దానికి ఊడల్ని అతికించాను
ఆ చెట్టు తొర్రలో నా సంపద న‍ంతా దాచాను
అక్కడా ఇంకా ఇలా రాశాను
మనిషిని శాసించే ఎలిమెంట్...
మానవాళిని కబళించేదిక్కడ ఉందని
ఆ సంపదనుంచిన తొర్రకు ఆనవాలుగా అక్కడ నా “అహాన్ని” వేలాడదీశాను
3
మరో సందర్భంలో ఓ భూగృహాన్ని కట్టించాను
కొన్ని యుగాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా చేశాను
ఆ భూగృహం లో నా సహచరిని “మమ్మి” గా చేసి ఉంచాను
దాన్నిండా ఆమెకు ఇష్టమైన వన్నీ ఉంచాను
వాటి గోడలపై ఇలా రాశాను
'నా' అనే అస్థిత్వం ఇక్కడి నుండే ప్రారంభమవుతుందని..
ఆ భూగృహానికి ఆనవాలుగా అక్కడ నా “ఆనందాన్ని” వేలాడదీశాను
4
పై మూడు సందర్భాలలో
నేను మరణిస్తూనే వచ్చాను
ఒక్కో మరణం నాలో ఒక్కో మార్పును తెచ్చింది
ఇప్పుడు నా దేహంలో
ఏ ఆనవాళ్ళు లేవు
ఎలాంటి భావావేశాలు లేవు
భావోద్వేగాలు లేవు
నన్నో స్థిత ప్ర‌జ్ఞుడని పిలుస్తున్నారు...

|| బంధీ ||




                                                  



 || బంధీ ||
             సి.వి.సురేష్
చిరిగిన నడిరేయి నుండి
చీకటి ధారగా కారుతూ నదిని నింపుతున్న శబ్దం...
ఎక్కడో ఏకాంతం లో ఉన్నా..
నా కనుల జారిన కన్నీటి బిందువు చెవుల్లోకి చేరింది
నిజమే కదా...ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కాయో!
...
...
కాలం చేతికి చిక్కిన నీవో నేనో..
నిశ్శబ్ద నడిరేయి ఎవరికీ వినిపించకుండ వేసిన గావుకేక
రాలిన క్షణాలను అక్కడికక్కడే లెక్కబెడుతూ
కుర్చోవాల్సిందే..
నమ్ముతావా ...! ఇప్పటికైనా ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కయో..?
..
..
ఇప్పుడిక నాకేమి మిగిలిందని..
నేర్రలు చీలిన నేలపై వృధాగా కొన్ని బాష్పాలను విడవడం మినహా..
ఆ నెల నుండి పోడుచుకొచ్చే
నా పురా పురా పూర్వీకుల జాలి ముఖాలు తప్ప..
నేనెప్పుడో చెప్పను కదా...
ఎన్ని నదీ తీరాలు అలా కొబ్బరాకుల
నడుమ బందీగా చిక్కినాయని....!!
....
....
సశేషం :
జినలజికల్ వృక్షాల ఊడలు
కింది నుండి పైకి ఊర్ధ్వ దిశగా మొలవడం....
ఎక్కడో బయల్పడిన ఫాస్సిల్స్ లో ఆనవాళ్ళను బట్టి
మనిషిగా మసలిన ఒక ప్రాచీన చీకటి
గుర్తు పట్టాల్సి వస్తుందని ....
ఇప్పుడైనా నమ్ము.....
ఆ నదీ తీరం ఎప్పటికి చెర వీడని బందీనే!!!.
*     *    *



నా తెలుగు కవిత "బంధీ" పై అద్భుతమైన విశ్లేషణ రాసిన రాజేశ్వరి రామాయణం గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ధన్యవాదాలు..!
I am very happy to see her analysis on my poem...!!
..
కవితా విశ్లేషణ.
కవిత్వం మనిషి యొక్క వూహల్లో పురుడుపోసుకున్న భావాల అక్షర మాలిక.
ఇది భిన్న ప్రత్రికలు,సాదృశ్యాలు కలుపుకొని
అల్ప పదాల్లో అనంత సారాన్ని ఒంపుకుంటుంది. ప్రతిభావంతులైన కవులు తమ ఆలోచనల్ని వ్యక్తం చేయడంలో కనబరిచే నిపుణత పాఠకుల్ని వేగంగా చదివించడమే కాదు సాంతం ఆలోచనల్లో ముంచివేస్తుంది.
అలాంటి ఓ కవితనే CV. సురేష్ గారు రాసిన "బందీ". మొన్న ఎప్పుడో చదివా . వెంటాడుతున్న భావాల సారాన్ని ఇలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా..
అజంతా గారు నేను శోధనా నాళికలలో,అర్థ సత్యాలలో జీవిస్తున్నాను.భ్రమ,విభ్రమాలలో బ్రతుకుతున్నాను.. భయంకరమైన వాస్తవం ఒకవైపు, కాలావధులకు అతీతంగా కలలపై పరిభ్రమిస్తున్న నైరూప్య ప్రపంచంలో నా అన్వేషణ ప్రారంభమవుతుంది...
అని తన స్వప్నలిపి కి ప్రారంభ వాక్యాల్లో ప్రస్తావించారు..
మనిషి లో మొదలైన అన్వేషణ భిన్న పార్శ్వాలను తాకుతూ ఒక్కోసారి నైరాశ్యంలో అతన్ని ముంచివేస్తుంది.
ఐనంతమాత్రాన అంతా నైరాస్యత ఉంటుందనేది జీవన సారం కాదు ..కానీ ఒక మనసు ఆలోకిక శాంతిని సంతరించుకుంటే మరింత తత్వాన్వేషణకు పునాది కాగలదనిపిస్తుంది..
సురేష్ గారి రచనలు గమనిస్తే తేలిగ్గా చదిివించే సరళమైన పద అల్లికతో పాటుగా నిగూఢ తాత్వికత కనిపిస్తుంది..ప్రేమ ప్రధానంగా సాగుతున్న గులాబీల సిరీస్ లోకూడా ఇదే గమనించవచ్చు..ఇప్పటి కవిత" బందీ "లో నా యోచన పరిధికి అందిన సారాన్ని స్టాంజాల వారీగా ఇలా రాసుకున్నాను.
1 స్టాంజా...
మనిషి ఏకాంతం లో కన్నీళ్లు కారుస్తూ తన యోచనలో గదిలో బందీగా...ఆ కన్నీళ్లు కింద పడుతుంటే... చీకటి ధారగా జారీ నదిలో కలిసే శబ్దం తో ప్రతీక..
2...స్టాంజా..
ఎన్ని ప్రయత్నాలు చేసినా..నీ జీవితానికి కాలం పరిష్కారం తప్ప ఇంకోటి కాదు.ఎవరూ చేయలేరు అని..చెప్పడం
3 స్టాంజా...
కంప్లీట్ desperation .. జీవితం లో ఇక మిగిలిందీ ఏమి లేదు..ఇక సాదించేది ఏమి లేదు అని...చెప్పడం..
నీవు కన్నీళ్లు కారిస్తే...గతించిన నీ పూర్వీకులకు స్పందన ఉంటుందేమో తప్ప ఇంకొకరికి ఎవ్వరికీ ఉండదు..
4.స్టాంజా..
సంతాన వృద్ధి తో వంశ వృక్షము (జానాలోజికల్ tree ) ని పెంచుకోవడం తప్ప. .... మనిషి తనం ను నీవు పుట్టించలేవు..ఆ అవకాశం ఉండదు..మనిషి తనాన్ని ఎక్కడో తవ్వకాల్లో శిలాజాల్లో ఇలా మనిషి ఉండేవాడిని.. చెప్పుకోవాలి తప్ప...ఇంకోటి ఉండదు..
ఇది సగటుమనిషి సంవేదన...ఒక కంప్లీట్ desperate situation..No body can change..అనే వ్యధ ఇలా బందీ కవిత గా అక్షర రూపాన్ని దాల్చుకుంది.
మనిషితనం అనేది ఇక వాస్తవ ప్రపంచంలో కనిపించదు..శిలాజాల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది...అలాంటి సమాజం లో మనిషి ఎప్పుడూ బంధీనే అనే నైరాశ్యం ఈ కవితకు ఆత్మగా వుందనిపిస్తోంది..
సమకాలీన సమాజంలో ఉన్న పరిణామాలు ఇలానే వున్నా మనిషిని నడిపించే ఓ అలౌకిక శక్తిని అదే "మనిషి పట్ల మరో మనిషికున్న సహానుభూతి "అనే బంధాన్ని ఇంకా విశ్వసించే ఎందరో సామాజిక జీవుల్లా ఆశని సాంతం నింపుకుందాం అని ; పరస్పర విశ్వాసాన్ని సంరక్షించుకొనే ప్రయత్నం కొనసాగించుదామని ఆశిస్తూ....
నా తొలి ప్రయత్నం లో దోషాల్ని సవరించే సహృదయత ని స్వాగతిస్తూ...
రాజేశ్వరి. రామాయణం.
18.06.18.

..

క్షితిజ రేఖ



 ॥ క్షితిజ రేఖ ॥

                           సి.వి.సురేష్

కొన్నిక్షణాలైనా
బ్రతకాలనుకోవడం సహజమై౦ది ..!

బ్రతికే తీరాలన్న బలమైన కోరిక
గది మూలన గుట్టలుగా పడిన
సూసైడ్ నోట్ల పరిహాసాల్లో...
చీకటిపాటలా వె౦టాడుతూనే ఉంటుంది.
..

సమూహాల బ్రతుకుల్లో...
మనసును 
పచ్చికబయళ్ళపై నడిపి౦చాలన్న గాఢమైన ఆశ!
రెక్కలాడిస్తూ కళ్లెదుటే వాలి పోతు౦ది. 
హిపోక్రసి !!!
...

కోరిన జీవిత౦ 
మెనుకార్డులాగా ఎదుటపడాలన్న తపన ...
వీలునామాల్లో గొలుసురాతల బ౦ధాలు
గజి బిజి గా స౦దడి చేస్తూ..... 

2
అనుభవాల కిటికీ ఆవల 
విడతలుగా వెలుగురేఖల అసహన కదలిక
విడతకూ విడతకూ మధ్య 
మరణవా౦గ్మూలాలు దోషిగా నిలబెడతాయ్...!!

3.
విస్తృత౦గా పుట్టుకొచ్చే ఆలోచనలకూ
సమాజపు ఇజాలకూ...
క్షితిజరేఖొకటి ఎప్పటికీ అడ్డ౦కే... !!!