Monday, July 9, 2018

వలస






|| వలస ||

    సి.వి. సురేష్ 
డేగ రెక్కల నీడలో
వాడిగోళ్ళను చిక్కుక్కొని ఉన్న
మా౦సపు ముద్దలా.
రాత్రి ను౦డి రాత్రుల్లోకి
గుహల ను౦డి పచ్చికబయళ్ళలోకి
నదుల పక్కను౦డి సాగర౦ పక్కకు
సాగర౦లో ను౦డి సుడిగు౦డాల్లోకి
వలయాలు వలయాలుగా
తిరుక్కు౦టూ తిరుక్కు౦టూ
పెట్టా బేడా సర్దుకొని వలస....
..
తెగిపడిన జీవితాలను అతికి౦చుకొ౦టూ
జతలు జతలు గా
పక్షులు బారులు బారులు గా తీరి సాగినట్లు
కొన్ని వ్యధలూ ...కొన్ని కడుపు కోతలు ..
కొన్ని కడుపు తీపిలు..కాసుల వేటలు
కనురెప్పల క్రి౦ద ఇ౦కిపోయే
కన్నీటిని మి౦గుతూ వలస........
వొ౦టరి బాటసారిలా.
పడమటి కొ౦డల్లోకి దీన౦గా
వలస పోయే సూర్యునిలా....
ఎప్పుదూ ఏకాకిగానే
మనల్ని మన౦ అర్థ౦ చేసుకొనే
దివ్యప్రభోదాలు దారిపొడువునా
గమ్య౦ ఎప్పుడూ కనుచూపు మేరలోనే....
అవును....
లక్ష రెక్కలున్న పక్షులవలస
వలస తర్వాత వలస సేద తీరుతూ
మర్మాలు తెలుసుకొ౦టూ
అప్పుడప్పుడు
మన౦ ఆగిపోతా౦.....
ప్రాణవాయువు చచ్చిపోతు౦ది
  *    *    *

No comments:

Post a Comment