Monday, July 9, 2018

విముక్తి








 || విముక్తి ||
                              సి.వి.సురేష్
నీది అని అనుకున్న ప్రతిదాన్ని
నిశ్శబ్ద౦గా చూడు...
నీది అని అనుకొన్న దేది
అక్కడ కనిపి౦చదు
నీవు సర్దుకొ0 దామనుకొన్నదేదైనా
నిన్నెదిరి౦చకు౦డా ఉంటుందని అనుకొన్నవా!?
నీలోకి సర్దుకొన్న ప్రతీది
నీలోను౦డి విడిపోయి నీ ము౦దే
నిటారుగా నిలుస్తు౦ది
..
ఏ ఆనవాళ్లు...
కనిపి౦చవు కానీ ..
పడగవిప్పిన‌ సర్పమొకటి మనలోకి పాకేఉ౦టు౦ది
ఒక్కోసారి ఒక్కో ముఖాన్ని తగిలి౦చుకొని
నగ్న౦గా నృత్య౦ చేసేస్తూ నీక్కనిపిస్తాయ్!
అవి నీవనుకొన్న ఆనవాళ్ళేనా? బాగా తరచి చూడు
..
ఇ‍౦కా గమనిస్తూనే ఉ౦డు
ఆ నవ్వులలోనో
ఆ కరచాలనాల్లొనో
ఆ స్పర్శల్లోనో ఎక్కడైనా ఎ౦డిన చెమ్మైనా
తగులుతు౦దేమో?
2
సుళ్ళు తిరిగుతూ సాగే నీ ప్రయాణ౦
నిన్నెక్కడో ఒక చోట కుదుపుల్లోకి తొసేస్తు౦ది
మజిలీని నీవున్న చోటికే తరలి౦చే
ఒక ఆశ చిగురి౦చేలా
ఒక ప్రయత్న౦ జరుగుతు౦ది
పిడచ‌ కట్టిన నాలికలపై
నీటి చెమ్మకోస౦ నీ ఆరాట౦
..
బోధనలన్నీ విని వినీ విసిగి వేసారావా?
నీ నగ్నదేహ0పై ఆధిపత్యానికి
అర్రులు జాచే ప్రవచనాలెన్నొ?
నిజ౦ తెలిసీ చెప్పక పోయావొ!
నీ తలను వేయి ముక్కలుగా చేసె మ౦త్రమొకటి
నీ చుట్టూ వలయ౦లా ...
3
ఇ౦తకూ !
ఇప్పుడు నీవు నీవుగా ఉన్నావా?
నీ ను౦డి విడిపోయి ఇ౦కో మనిషివైనావ!
విడిపోయి ఉంటే ఇక
నీవో శాపవిమోచనుడివే!!!
*  *   *

No comments:

Post a Comment