Monday, July 9, 2018

సగం తెగిన ఆకాశం




మహిళా దినోత్సవ సందర్బంగా..!! 
..
|| సగం తెగిన ఆకాశం || 
               సి.వి. సురేష్
..
సగం ఆకాశం ఇప్పుడే
తన చుట్టూ అల్లిన నగ్న దేహ కథల్ని
రోజూ రిఫ్రెష్ చేసుకొంటూ ....
చాలా సాయంత్రాల్లోకి వొదిగిపోయి వాలి పోతుంది.
..
విచ్చిన పువ్వులపై వాలే
చీరె కట్టుకొన్న ఆకాంక్ష
వివస్త్ర ను చేసిన ఓటమి లో సాధ్వి ప్రతీకగా..!
..
ఏ ఉదయాన్నో మెరిసే రంగవల్లుల్లో
ఒక వాకిట కల్లాపి లాగా
దూరహంకార వాంచలపై వాలి సేద తీరే సహనపు ఆకాశం!
..
ఒక్కో సంధ్య లో ఎప్పటిలాగే ఏకాంతమవుతూ
నాలుగు గోడల మధ్య ఎన్నో రాత్రుళ్లలో
తునకలయ్యే ముక్కల దేహం పై
మంచు అవలాంచే ల విధ్వంసం!!
..
2

కొన్ని స్వేచ్చా నటనలతో ...
హాయిగా సాక్ష్యం చెప్పుకొంటూ
చెప్పుకోవడానికే మిగిలిన
కాసింత చరిత్ర ని అందులో కొందరే పతివ్రతల్ని
తయారు చేసిన పురాణాల్లో ఇప్పుడు సగం ఆకాశం మెరిసిపోతూ..!
..
3
వచ్చేయి.!
మబ్బు తునకల తోడుగా కొన్ని మగ దేహాలను
సేద తీరుస్తాం..
దేహాన్నే వస్తువు గా మార్చిన వారి మధ్యన
హాయిగా విషెస్ చెప్పుకొందాం!
4

...
కొన్ని స్వప్నాలపై సీతాకోక రెక్కలను ఏరుకొంటూ..
ముళ్ళ కంచేల్లో స్వేఛ్చ గీతాలను ఆలపిస్తూ
రేపటి ఉదయాన మగ సూర్యుణ్ణి కనాలన్న నిర్బంధంలో
సగం తెగిన ఆకాశపు ఎదురు చూపులు !!!
..

No comments:

Post a Comment