Monday, July 9, 2018

అమ్మ





॥ అమ్మ !!
              సి.వి.సురేష్ ....
అంతాంతరనా ఓ చమురుదీపమై
అన్ని సాయింత్రాలను వెలిగిస్తూ
రాతిరికి జోలపాటయ్యేదమ్మే
...
కొన్ని నిశ్శబ్ధాలను మోసుకెళ్తూ
కడుపులో తొంగి చూసే
ఆ చూపులు
నా నిర్ధయ పశ్చాత్తాపంలో
కళ్ళు చెమర్చే ప్రతీ సందర్భం అమ్మదే!!
....
రేగే
ఓ అజ్ఞాత భయవిహల్వత
మనసు చుట్టుముట్టే
ప్రతీ క్షణ౦
సేదతీర్చే స్పర్శలు ...
తిరిగి అమ్మగర్భ౦లోకి జారవిడిచేవి..
నిశ్చిత నిర్భయాలతో...
ఆ తొమ్మిదినెలలూ
కలకాలమవ్వాలనిపించేదీ అమ్మే!
.....
ఒక వారగా నిల్చొని
ఆమె పువ్వుల్ని పూయి౦చినప్పుడు.....
ప్లాస్టిక్ నవ్వుల ఎరుక పరిచేదీ అమ్మనే!
....
దోసిలిపట్టి
ఒక వ్యధగీతాన్నో..
ఇంకో ఆశ్రు నయనాన్నో....
తర్పణ అంజలి ఘటించమని
గోడకు వేలడుతూ నాకో స౦దేశాన్ని ప౦పడం..
చర్విత చర్వణం ప్రతి ఏటా మా అమ్మే
...
వర్షపు చినుకు నను తాకిన
ప్రతి సందర్భం
నాకోసం నీవు విడిచే
కన్నీళ్లొ.. ఆనంద బాష్పాలో అనిపిస్తావమ్మా!!
*    *   *

No comments:

Post a Comment