Monday, July 9, 2018

నాన్నవి



 ॥ నాన్నవి॥
                  సి.వి.సురేష్
ఉరకలెత్తే అలని
ఏ తీరానికి చేర్చాలో తెలిసిన మర్మానివి..
బిక్కు బిక్కుమనే అధైర్యపు క్షణాలను
లెక్కపెట్టి మరీ ఏరిపారేసిన ధైర్యానివి...!
.........
నోరు తిరగని ఎన్నో పదాలతో
ఎదురొడ్డి
వాటిని అక్కున చేర్చిన భాషవీ...
శబ్ధరత్నాకరానివి
నాన్నవి..!
........
హోరెత్తే స౦ద్రాన్ని ఎదురీదే వేళల్లో
"ఆటు" సమయాన్ని... 
"పోటు" ఘడియల్ని
లెక్కెట్టి నా చెవిలొ నూరిపోసిన
 అనుభవైక నావికుడివి
నాన్నవి... !!
......
మెదడు లోతుల్లో మట్టి పొరలను
తట్టి విదిలి౦చి లేపిన
బోధి వృక్షానివి
నాన్నవి...!!!
.......
కనువిప్పుల లౌక్యాన్ని నా మొదడులో
నీ మార్కుగా మలచి దారి చూపుతున్న
చుక్కానివి
.
నీ పొత్తిళ్ళల్లో నీరు పోసుకొని పెరిగిన ఈ చెట్టు
ఫలాన్ని రుచి చూడకు౦డానే
ఆవిరైపోయిన నాన్నవి...!
అన౦త లోకాలకు వెళ్ళిపోయిన నాన్నవి...!!!
నీవు నేర్పిన భాషతోనే రాసిన
ఈ చిన్ని కవిత నీకే అ౦కితమిస్తూ...!!!
…………………
ఒక కవిత కలెక్షన్ నుండి
  *   *

No comments:

Post a Comment